Home » Adilabad
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయమని, నియోజకవర్గంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి అన్నారు. మంగళవారం మల్లంపేటలో పలు గ్రామాలకు సంబంధించి రూ. 1.10 కోట్ల నిధులతో 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ నిర్మాణ పనులు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
సొంత ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఏమిటనేది సందిగ్ధంలో పడింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీకి నోచుకోలేదు. అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు వృథాగా పడి ఉన్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఊత్కూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ యేటా రైతుకు పంట పెట్టుబడికి రూ.15వేలు ఇస్తామంటూ ఏడాది అనంతరం రూ.12వేలు ఇస్తామనడం సరికాదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు అమలు సందర్భంగా ఐబీ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు.
సామాన్య మహిళలను ఆర్థికాభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళ శక్తి పథకంలో భాగంగా ముల్కల్ల పంచాయతీలోని వీరాంజనేయ గ్రామ సంఘం రాజరాజేశ్వరి చిన్న సంఘం సభ్యురాలు సుద్దాల విజయ పొందిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించారు.
గిరిజన గూడాల్లోని యువకులు ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని బెల్లంపల్లి ఏసీపీ రవికు మార్ అన్నారు. సోమవారం దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాత తిర్మలాపూర్‌లో నిర్వహించిన పోలీ సులు మీ కోసంలో మాట్లాడారు. చదువు వల్ల సమా జంలో గౌరవం లభిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువు కుని ఉన్నత ఉద్యోగాలు చేయాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం గూడెం ఎత్తిపోతల నీటిని ఆదివారం కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల చీఫ్ ఇంజనీర్ బద్రినారాయణతో కలిసి పూజలు చేసి నీటిని విడుదల చేశారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతీ కార్యకర్తను గుర్తిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ పసివుల్లాతోపాటు పది మంది డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయిం చారు.
కవ్వాల టైగర్ జోన్‌లో బర్డ్‌వాచ్ పర్యాటకులను ఆకర్షించింది. ఆదివా రం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బర్డ్‌వాచ్‌కు 15 మంది పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి ఇందన్‌పల్లి రేంజ్‌లోని అటవీ ప్రాంతంలోని గన్‌శెట్టి కుంట వద్ద ఏర్పాటు చేసిన గుడారాల్లో బస చేశారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని సివిల్ జడ్జి ముఖేష్, ఏసీపీ రవికుమార్‌లు అన్నారు. ఆదివారం ఏఎంసీ క్రీడా మైదానంలో న్యాయవాదులకు, పోలీసుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిం చారు.