Home » ABN Andhrajyothy Effect
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు చెందిన లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం గత రాత్రి వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్ట బద్ధత కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం నేడు కీలక తీర్పు వెల్లడించింది.
ఇక నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ కూడా అభిమానులను అలరించనుంది. ఈ మేరకు ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్‌ను నిర్వహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సోమవారం ఆమెదం తెలిపింది.
పాలస్తీనా గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో యుద్ధంలో మరణ మృదంగం మార్మోగుతోంది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రతీకార దాడి ఒకటి అమెరికాలో కలకలం సృష్టించింది. ముస్లిం మతానికి చెందిన ఆరేళ్ల బాలుడు, అతని 32 ఏళ్ల తల్లిపై ఓ భూస్వామి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చిన అమెరికా ఇప్పుడు సడంగా మాట మార్చింది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు వైపుల నుంచి వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో హైదరాబాద్ సిరాజ్ మియా సత్తా చాటాడు. తన సహజ శైలికి అనుగుణంగా పవర్ ప్లేలోనే వికెట్ తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్‌ను 8వ ఓవర్ చివరి బంతికి మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు.
గృహ కార్మికుల రిక్రూట్‌మెంట్ విషయమై సౌదీ అరేబియా (Saudi Arabia) లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ కొత్త కండిషన్ పెట్టింది. ప్రవాసులు తమ సొంత జాతీయులను గృహ కార్మికులు (Domestic workers) గా రిక్రూట్ చేసుకోవడాన్ని నిషేధించింది.