నేపాల్‌లో సంభవించిన జలప్రళయంలో ఇరుక్కుపోయిన, గల్లంతైన వారిలో తెలుగు ప్రవాసీయులు కూడా ఉన్నారు. అక్కడ సెల్ ఫోన్లు కూడా పని చేయకపోవడంతో వారి బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.
మిషిగన్ రాష్ట్రంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రాయ్ తెలుగు అసోసియేషన్ 20వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.
అమెరికాలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మను హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA – తానా) సామాజిక సేవలో భాగంగా న్యూజెర్సీలోని పెర్త్ అంబాయ్లో ఉన్న రారిటన్ YMCA – సెంటర్ ఫర్ సపోర్ట్, సక్సెస్ & ప్రాస్పెరిటీలో ‘బ్యాక్‌ప్యాక్ అండ్ స్కూల్ సప్లైస్ డొనేషన్’ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.
కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం(తామా) సంయుక్తంగా 2026 ఆగస్టు 9న జార్జియాలోని ఆల్ఫారెట్టాలో ఉన్న కెటి బాంక్వెట్స్‌లో ‘ఉపస్తంభ’ యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియాన్ విభాగం ఆధ్వర్యంలో ఛార్లెట్‌లో ఆగస్టు 22న పురుషుల వాలీబాల్ టోర్నమెంట్, మహిళల ఇంటర్నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
కన్న వారి బంగారు భవిష్యత్తు కోసం ఎడారిబాట పట్టిన తండ్రి అకాల మరణంతో అల్లాడిపోయిన చిన్నారులకు తెలుగు ప్రవాసీ లోకం తోడుగా నిలిచింది.
భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. లండన్‌లోని భారత హై కమిషన్, భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా నిర్వహించిన ఇండియా డే వేడుకల్లో.. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న పేద ప్రవాసాంధ్రులకు ఉచిత ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని వర్తింపజేయడానికి జనసేన నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రఖ్యాత సినీనటుడు చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానలు బహ్రెయిన్‌లో రక్తదానం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.