ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు.
భారత ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 3న చెన్నై రానున్నట్లు తెలిసింది. ఆ రోజు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న మోదీని చెన్నైకికూడా రప్పించాలని ఎన్‌డీఏ నేతలు సన్నాహాలు చేపట్టారు.
డీఎంకే చిహ్నంపై పోటీ చేయాల్సి రావడం పట్ల ఎండీఎంకే నేత అర్జున్‌రాజ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. తమ చిహ్నంపై పోటీ చేయలేకపోవడం పట్ల తాము బయటకు నవ్వుతూనే వున్నా.. లోలోన ఏడుస్తున్నామన్నారు.
శాసనసభ ఎన్నికల్లో అన్నామలై పోటీచేయాలని బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమిలో బీజేపీకి 27 సీట్లు కేటాయించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, సెక్యూలర్ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఏప్రిల్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని డీఎంకే ప్రధాన కార్యాలయం గురువారం ప్రకటించింది.
‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుండి సోమవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీల్లో రూ.151 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులు పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు.