బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ను రేపు నిర్వహించనున్నారు. ఎన్డీయే, మహాగఠ్‌బంధన్‌లల్లో విజయం ఎవరిని వరిస్తుందో రేపు తేలిపోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఎన్డీయే కూటమిదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 14వ తేదీన ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ బిహార్ బీజేపీ శ్రేణులను సంబరంలో ముంచెత్తుతోంది. పోల్ డే రోజు పెద్ద ఎత్తున లడ్డూలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్‌లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్‌బంధన్‌కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఈసీ నిబంధనలు అతిక్రమించారనే కారణంతో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్‌బంధన్‌లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మరి ప్రజాభిప్రాయంపై సర్వే సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బెట్టింగ్ రాయుళ్లు భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కాశారు. దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్‌లు వేసినట్లు సమాచారం.
ఎన్డీయేకు 145 నుంచి 160 సీట్లు వస్తాయని 'దైనిక్ భాస్కర్' ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఎన్డీయేకు 147 నుంచి 167 సీట్లు వస్తాయని మాట్రిజ్ అంచనా వేసింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వే నివేదికలు వచ్చేశాయ్. జూబ్లీహిల్స్‌లో జయకేతనం ఎగురవేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్స్‌కు ముందే చెప్పేశాయ్. అక్టోబర్ 13వ తేదీ నుంచి మొదలైన.. ఈ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా..