• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

Loksabha Polls: మూడో విడత పోరులో కోటీశ్వరులు ఎంతమంది అంటే..?

Loksabha Polls: మూడో విడత పోరులో కోటీశ్వరులు ఎంతమంది అంటే..?

మూడో విడత లోక్ సభ ఎన్నిక మే 7వ తేదీన జరగనుంది. మొత్తం 1352 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 392 మంది అంటే 29 శాతం అభ్యర్థులు కోటిశ్వరులు. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రకటించింది.

Loksabha Polls: సందేశ్ ఖాళి బాధితురాలికి భద్రత

Loksabha Polls: సందేశ్ ఖాళి బాధితురాలికి భద్రత

పశ్చిమ బెంగాల్‌ బసిర్షత్ బీజేపీ అభ్యర్థి రేఖా పాత్రకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. రేఖాకు ఎక్స్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. సందేశ్ ఖాళీలో నెలకొన్న హింస, లైంగిక దాడి, భూ ఆక్రమణల గురించి ప్రపంచానికి రేఖా పాత్ర తెలియ జేశారు. మాజీ తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ అతని అనుచరుల ఆగడాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: నామా ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

లోక్‌సభ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao)ని ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అవుతారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తామని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని ఉద్ఘాటించారు.

Lok Sabha Elections 2024: రిజర్వేషన్లు తీసేస్తే బీజేపీ నేతలను తరిమి కొడతారు: మంత్రి ప్రభాకర్

Lok Sabha Elections 2024: రిజర్వేషన్లు తీసేస్తే బీజేపీ నేతలను తరిమి కొడతారు: మంత్రి ప్రభాకర్

కేంద్రంలో మరోసారి బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. రిజర్వేషన్లు ముట్టుకుంటే బీజేపీ నేతలు మాడిమసై పోతారని వార్నింగ్ ఇచ్చారు.

Lok Sabha Elections 2024: అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కింది: హరీశ్‌రావు

Lok Sabha Elections 2024: అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కింది: హరీశ్‌రావు

అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ (Congress) గద్దెనెక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని.. దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధర, నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచిందని మండిపడ్డారు.

 Lok Sabha Elections 2024: అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ మార్పింగ్ చేసింది: కిషన్‌రెడ్డి

Lok Sabha Elections 2024: అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ మార్పింగ్ చేసింది: కిషన్‌రెడ్డి

సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( Kishan Reddy) అన్నారు. కాంగ్రెస్ (Congress) గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే..: రఘురాంరెడ్డి

Lok Sabha Elections 2024: పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే..: రఘురాంరెడ్డి

అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తమ ప్రభుత్వం 5 గ్యారెంటీలను పూర్తి చేసిందని కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి (Rama Sahayam Raghuram Reddy) తెలిపారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ (Congress) కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్లొన్నారు. కాంగ్రెస్ నాయులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

 Lok Sabha Elections 2024: అందుకే మోదీ మూడోసారి  ప్రధాని కావాలి: మంత్రి పొంగులేటి

Lok Sabha Elections 2024: అందుకే మోదీ మూడోసారి ప్రధాని కావాలి: మంత్రి పొంగులేటి

మాయమాటలు చెప్పటం తప్పా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) దేశానికి ఏం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రశ్నించారు. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

Lok Sabha Elections 2024: రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా.. కేటీఆర్ సూటి ప్రశ్న

Lok Sabha Elections 2024: రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా లేదా ఎమ్మెల్యేనా.. కేటీఆర్ సూటి ప్రశ్న

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండటంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర విమర్శలు గుప్పించారు. దేవుడైనా రాముడిని బీజేపీ నేతలు రాజకీయాల్లోకి తీసుకొచ్చి లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దానికి రాముడిని తెరమీదకు తీసుకువస్తున్నారని చెప్పారు. రాముడు ఏమైనా బీజేపీ ఎంపీనా, లేక బీజేపీ ఎమ్మెల్యేనా అని సూటిగా బీజేపీ నేతలను కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.

Lok Sabha Elections 2024: సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు

Lok Sabha Elections 2024: సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సంగ్రామం జరుగుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) పార్టీలు ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘానికి ఈ పార్టీలు శనివారం నాడు ఫిర్యాదు చేశాయి. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి