మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఇప్పుడు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
ఓట్ల లెక్కింపు రోజున రాష్ట్రంలో భారీగా అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కౌంటింగ్ ఏజెంట్ల నేర చరిత్ర తనిఖీ పేరుతో టీడీపీ కూటమి నేతల్ని ఇబ్బంది పెట్టాలని జగన్ సర్కార్ చూస్తోందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ (మే -13), ఆ తర్వాత రోజు నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతునే ఉన్నారు.
కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish kumar Gupta) తెలిపారు. 301 సమస్యాత్మాక ప్రాంతాలను గుర్తించి సోదాల నిర్వహించినట్లు తెలిపారు. సోదాల్లో ఎలాంటి పత్రాలు లేని 1104 వాహనాలు జప్తు చేసినట్లు చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు పర్యటన నుంచి వీరికి ఎందుకు అంత ఆత్రం..? భద్రతా కారణాల వల్ల అన్ని విషయాలు బయటకు చెప్పరు కదా..? జగన్ రెడ్డి మాదిరిగా చంద్రబాబుపై కోర్టు ఆంక్షలు లేవు కదా..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) వైఎస్సార్సీపీకి (YSRCP) ఓటమి భయం వెంటాడుతోనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయమని రాజకీయ వ్యూహకర్తలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.