ఏపీ రాజకీయ నేతల్లో అంబటి రాంబాబు గురించి తెలియని వారు ఉండరు. మంచి వాక్ చాతుర్యం కలిగిన అంబటి 1989 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో వచ్చారు. ఆ క్రమంలోనే 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1994, 1999లో కూడా రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఓటమి చెందారు. దీంతో ఆ తర్వాత కొన్నేళ్లు రాజకీయాలకు విరామం ఇచ్చారు. 2005 నుంచి 2009 మధ్య కాలంలో ఏపీ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్గా పనిచేశారు.
వైసీపీలోకి
వైఎస్సార్ మరణం తర్వాత 2011లో స్థాపించిన వైఎస్సార్ పార్టీలో చేరి అంబటి రాంబాబు పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇక వైసీపీలో అంబటి చేరిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. దివంగత నేత కోడెల శివ ప్రసాద రావు చేతిలో అంబటి రాంబాబు కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసిన కోడెల శివ ప్రసాద రావుకు 85,247 ఓట్లు రాగా, వైసీపీ నుంచి పోటీ చేసిన అంబటికి 84,323 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి అంబటికి 105,063 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన కోడెల శివ ప్రసాద రావుకు 84,187 ఓట్లు వచ్చాయి. 2019లో అంబటి 20,876 ఓట్ల మెజారిటీ దక్కించుకున్నారు.
జగన్ మంత్రివర్గంలో
సీఎం జగన్ మంత్రివర్గంలో అంబటి జలవనరులశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2022లో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా అంబటి రాంబాబుకు జగన్ మంత్రివర్గంలో అవకాశం దక్కింది.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 66 | 2 | Business | Graduate Professional | 42 Cr+ | 11 Cr+ | 9Cr+ | 34Cr | 23 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
