గౌతు శిరీష తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆమె సొంత నియోజకవర్గం. స్వాతంత్ర్య పోరాట యోధుడు గౌతు లచ్చన్న మనవరాలు. సీనియర్ రాజకీయ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. శిరీష తండ్రి 198, 1994, 1999, 2004 ఎన్నికల్లో సోంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో సోంపేట పలాసగా మారింది. 2014 ఎన్నికల్లో పలాస నుంచి శిరిష తండ్రి శ్యాంసుందర్ శివాజీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో పలాస నుంచి టీడీపీ అభ్యర్థిగా శిరీష పోటీచేసి వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు చేతిలో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో పలాస నుంచి టీడీపీ తరపున ఆమె పోటీ చేస్తున్నారు.
ప్రజానాయకురాలు..
మంచి వాగ్దాటి కలిగిన నాయకురాలు గౌతు శిరీష. పార్టీ గళాన్ని గట్టిగా వినిపించే నేత. గౌతు లచ్చన్న మనవరాలుగా అందరికీ సుపరిచితురాలు. ఉన్నత విద్యావంతురాలు. ఆమె వెంకన్న చౌదరి అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ తరపున అనేక ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహించారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు శిరీష కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికి.. ఆమె సమర్థంగా ఎదుర్కోన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకురాలిగా నియోజకవర్గంలో పేరుంది.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Female | 49 | 3 | Running A Petrol Bank | Post Graduate | 43 Cr+ | 74 Cr+ | 21Cr+ | 22Cr+ | 15 Lacs+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
