వసంత కృష్ణ ప్రసాద్ 1970 ఏప్రిల్ 9న కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరంలో జన్మించారు. వీరిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు రెండు సార్లు నందిగామ ఎమ్మెల్యేగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హోంశాఖ మంత్రిగా సేవలందించారు. జై ఆంధ్రా ఉద్యమ నాయకుల్లో కృష్ణ ప్రసాద్ తండ్రి నాగేశ్వరరావు ఒకరు. కాంగ్రెస్ పార్టీ ద్వారా కృష్ణప్రసాద్ రాజకీయ ప్రవేశం చేశారు. 1999 ఎన్ని్కల్లో నందిగామ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా, ఆప్కాబ్ చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో నాప్కాబ్ వైస్ చైర్మన్‌గా పని చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా
తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆప్కాబ్ చైర్మన్ పదవికి కృష్ణప్రసాద్ రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి.. నందిగామలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల ప్రబాకర్‌రావు గెలుపులో కీలకంగా పని చేశారు. 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో వైసీపీ నుంచి మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి సమీప తెలుగుదేశం అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావుపై గెలుపొంది తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ముక్కుసూటి మనిషిగా కృష్ణప్రసాద్‌కు పేరుంది. మైలవరంలో గ్రూపు రాజకీయాల కారణంగా ఆయన వైసీపీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో కృష్ణప్రసాద్ అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేశారు. 2024 మార్చిలో తెలుగుదేశం పార్టీలో చేరి మైలవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
| లింగం | వయస్సు | కేసులు | వృత్తి | చదువు | మొత్తం ఆస్తులు | బాధ్యతలు | చరాస్తులు | స్థిరమైన ఆస్తులు | మొత్తం రాబడి |
|---|---|---|---|---|---|---|---|---|---|
| Male | 13 | 2 | Public Service and Business | 10th Pass | 188 Cr+ | 48 Cr+ | 88 Cr+ | 100 Cr+ | 4 Cr+ |
| S.No | నియోజకవర్గం | విజేత | పార్టీ |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
| S.No | నియోజకవర్గం | విజేత | లింగం | పార్టీ | గుర్తు |
|---|
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీ ఎన్నికలు 2024
సీట్ల కూర్పు
మొత్తం సీట్లు
: 175
ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది
: 29
ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది
: 7
ఎలెక్టరేట్ వివరాలు
మొత్తం ఓటర్లు
: 4,08,07,256
పురుషులు ఓటర్లు
: 2,00,74,322
మహిళా ఓటర్లు
: 2,07,29,452
థర్డ్ జెండర్ ఎలెక్టర్లు
: 3482
సర్వీస్ ఎలక్టర్లు
: 67,434
పోలింగ్ స్టేషన్లు
: 46,165
