Share News

రేపు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు

ABN , Publish Date - Jun 21 , 2026 | 07:11 PM

రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది.

రేపు ఏపీలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు
Andhra Pradesh rain alert

ఇంటర్‌నెట్ డెస్క్: రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించిందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. పలుచోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.


ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని ప్రజలను హెచ్చరించింది. భారీ హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది.


తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఉరుములు వినిపించగానే రైతులు, కూలీలు, పశుకాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అవసరమైతేనే బయటకు రావాలని, వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించి ప్రాణ నష్టం నివారించుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రజలు వాతావరణ పరిస్థితులపై తాజా సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వర్షాలు, పిడుగుల నేపథ్యంలో రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


ఇవి కూడా చదవండి

అమెరికా రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ

Updated Date - Jun 21 , 2026 | 07:25 PM