అమెరికా రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ABN , Publish Date - Jun 21 , 2026 | 06:50 PM
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతతనిచ్చే గొప్ప ప్రక్రియ అని గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సంలో ఆయన పాల్గొన్నారు.
యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానసిక ప్రశాంతతనిచ్చే గొప్ప ప్రక్రియ అని గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియాలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా శ్రీ పతంజలి మహర్షికి, స్వామి వివేకానంద చిత్రపటాలకు పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు, పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని భానుప్రకాష్ మాగులూరి సమన్వయపరిచారు.
ఈ సందర్భంగా మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘యోగా అనేది కేవలం శారీరక వ్యాయాయమే కాదు. శరీరం, మనస్సును సమన్వయం చేసే గొప్ప భారతీయ సంప్రదాయం. యోగా ద్వారా ఆరోగ్యం, ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మన జీవితంలో అత్యంత అవసరమైన సాధనంగా యోగా మారింది’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారని చెప్పారు. గతేడాది నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది.

భాను మాగులూరి మాట్లాడుతూ ప్రతి రోజు యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. పెద్దలు మనకు అందించిన అమూల్యమైన కార్యక్రమం యోగా అని వ్యాఖ్యానించారు. 175 దేశాల్లో భారత సాంప్రదాయ యోగాను ఆచరిస్తున్నారని తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని అగ్రరాజ్యమైన అమెరికాలో జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. మాతృబాష తరువాతి తరానికి అందించటం తెలుగువారి భాధ్యతన్నారు.
ప్రవాసాంధ్రుల తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు మైనేని రామ్ ప్రసాద్ మాట్లాడుతూ యోగా ప్రకృతి ప్రసాదించిన వరం అని అన్నారు. దాన్ని నిలబెట్టుకోవటం, అభ్యాసం చేయటం అందరి భాద్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్ అమరవాది పలు యోగాసనాల మెళకువలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు, రమేష్ అవిర్నేని, మురళి కట్ల, హనుమంతురావు వెంపరాల, చంద్రనాధ్ నంబూరు, శంకర్రావు పొన్నం, పూర్ణచంద్రరావు అన్నం, వెంకటేశ్వర్రావు సామినేని, ఈశ్వర్ కక్కెర, వెంకటరెడ్డి గోలి, సుబ్బారెడ్డి జొన్నల ,కృష్ణయ్య, రమణ, సురేష్ లగిశెట్టి, యోగానంద్ వంకిన, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటి, సత్తయ్య మారిశెట్టి, ప్రభులింగం బచ్చు తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:
ప్రవాసంలో ప్రసవం.. సంస్కృతి, సంప్రదాయాల మధ్య నవజాత శిశువు
2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే భాను ప్రకాశ్