ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ నసీం దురాని హతం
ABN, Publish Date - Nov 20 , 2026 | 11:25 AM
ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా క్యాంప్ కార్యాలయం సమీపంలో సమీర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ నసీం దురాని ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఢిల్లీ పోలీసులతో పాటు నోయిడా ఎస్టీఎఫ్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడు, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 'డీ-కంపెనీ'తో సంబంధాలున్న కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నసీం దురాని పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా క్యాంప్ కార్యాలయ సమీపంలో 26 ఏళ్ల సమీర్ అనే యువకుడిపై 10 నుంచి 20 రౌండ్లు కాల్పులు జరిపి దారుణంగా హతమార్చిన ఘటనలో నసీం దురాని ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Updated at - Nov 20 , 2026 | 11:25 AM