ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లక్ష్యంగా వైసీపీ వికృత క్రీడ
ABN, Publish Date - Apr 07 , 2026 | 10:59 AM
హైదరాబాద్‌లోని ఏబీఎన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మావిగన్ గురించి ప్రశ్నించినందుకు ఈ రకంగా ఆందోళన ముసుగులో దాడులకు పాల్పడ్డారు.
హైదరాబాద్, ఏప్రిల్ 07: నగరంలోని ఏబీఎన్ కార్యాలయం ఎదుట మంగళవారం ఉదయం వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మావిగన్ గురించి ప్రశ్నించిన ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కథనాన్ని వ్యతిరేకిస్తూ.. కార్యాలయం ఎదుట ప్లకార్డులతో బైఠాయించారు. ఆందోళన ముసుగుతో దాడులతో భయపెట్టేందుకు యత్నించారు వైసీపీ నేతలు. ఈ క్రమంలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఏబీఎఎన్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. మహిళలను అడ్డుపెట్టుకుని ఈ రకంగా.. మీడియా సంస్థలపై బెదిరింపు దాడులకు యత్నిస్తోంది వైసీపీ.
Updated at - Apr 07 , 2026 | 11:22 AM