వైద్యుడిపై దాడి.. అసలేం జరిగిందంటే..
ABN, Publish Date - Mar 25 , 2026 | 06:42 AM
వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలిక గర్భవతి అని తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఆగ్రహించారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ యజమానిపై దాడికి పాల్పడ్డారు.
వరంగల్ జిల్లా: నర్సంపేటలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలిక గర్భవతి అని తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో కుటుంబసభ్యులు ఆగ్రహించారు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన స్కానింగ్ సెంటర్ యజమానిపై దాడికి పాల్పడ్డారు. కడుపు నొప్పి అని వచ్చిన చిన్నారికి గర్భం ఉందని రిపోర్టు ఇవ్వగా.. ఆశ్చర్యపోయిన బాధిత కుటుంబం నర్సింగ్ హోమ్‌లో పరీక్షలు చేయించారు. దీంతో చిన్న టిష్యూ మాత్రమే ఉందని తేలింది. వెంటనే సదరు ప్రైవేటు స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. తప్పుడు రిపోర్టు ఎలా ఇస్తావంటూ మండిపడ్డారు. అనంతరం దేహశుద్ధి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
పెద్దిరెడ్డి అనుచరుల చేతివాటం
ఆ ఏరియాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి కరెంట్ కట్
Updated at - Mar 25 , 2026 | 06:42 AM