ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ1గా కేసీఆర్‌, ఏ2గా కేటీఆర్‌!

ABN, Publish Date - Nov 15 , 2026 | 10:28 AM

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జిషీట్‌కు సిట్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేసీఆర్‌ను ఏ1గా, కేటీఆర్‌ను ఏ2గా పేర్కొనే అవకాశం ఉందని కథనాలు వెల్లడిస్తున్నాయి. ట్యాపింగ్‌కు అనుమతించిన అధికారుల పాత్రనూ చార్జిషీట్‌లో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తుది చార్జిషీట్‌కు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఏ1గా, ఆయన కుమారుడు, అప్పటి మంత్రి కేటీఆర్‌ను ఏ2గా పేర్కొనడానికి సిట్‌ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. అలాగే, ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చిన ఉన్నతాధికారుల పేర్లు, వారి పాత్రను వివరంగా సాక్ష్యాధారాలతో సిట్‌ అధికారులు పేర్కొనబోతున్నారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

Updated at - Nov 15 , 2026 | 10:28 AM