అధిష్టానం చెప్పింది చేశాను..రాజీనామాపై సిద్దరామయ్య

ABN, Publish Date - May 28 , 2026 | 03:30 PM

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అందుబాటులో లేరని తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శికి తన రాజీనామా లేఖ అందజేసినట్లు చెప్పారు.

బెంగళూరు, మే 28: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అందుబాటులో లేరని తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యదర్శికి తన రాజీనామా లేఖ అందజేశానన్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు తాను సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. అధిష్ఠానం సూచనలను తాను శిరసా వహించానని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ ఆమోదించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం సంపూర్ణ మెజార్టీతో ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తనకు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం కల్పించిన ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే‌లకు ధన్యవాదాలు తెలిపారు.

Updated at - May 28 , 2026 | 04:23 PM