అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్..

ABN, Publish Date - Mar 28 , 2026 | 06:33 AM

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం, సవాళ్లను టీం ఇండియాలా సమష్టిగా కలిసి ఎదుర్కొందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా సమయంలోనూ ఇలాంటి సవాళ్లే ఎదురయ్యాయని, వాటిని విజయవంతంగా అధిగమించామని తెలిపారు.

ఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన సంక్షోభం, సవాళ్లను టీం ఇండియాలా సమష్టిగా కలిసి ఎదుర్కొందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా సమయంలోనూ ఇలాంటి సవాళ్లే ఎదురయ్యాయని, వాటిని విజయవంతంగా అధిగమించామని తెలిపారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లతో ప్రధాని మోదీ నిన్న (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు చేశారు. యుద్ధం రోజురోజుకీ మలుపు తిరుగుతోందని, దీనికి అనుగుణంగా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన వ్యూహాలను రూపొందించుకోవాలని సూచించారు ప్రధాని మోదీ.


ఈ వార్తలు కూడా చదవండి

ముగ్గురు చిన్నారులతో బావిలోకి దూకిన తల్లి
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

Updated at - Mar 28 , 2026 | 06:34 AM