నాగబాబు పోస్ట్‌కు ప్రకాశ్ రాజ్ కౌంటర్

ABN, Publish Date - Jun 06 , 2026 | 01:58 PM

నాయకుడికి అన్నీ తెలుసని, ఆయన మాటే శాసనమనమంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో నాగబాబు పెట్టిన పోస్ట్‌పై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. నాయకుడి మాటను అనుసరించాలని ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని వినతి చేస్తూ పవన్ ఫొటోను నాగబాబు పోస్ట్ చేశారు.

అమరావతి, జూన్ 6: నాయకుడికి అన్నీ తెలుసని, ఆయన మాటే శాసనమనమంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో నాగబాబు పెట్టిన పోస్ట్‌పై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించారు. నాయకుడి మాటను అనుసరించాలని ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని వినతి చేస్తూ పవన్ ఫొటోను నాగబాబు పోస్ట్ చేశారు. అయితే మౌనంగా నాయకుడిని అనుసరించడమనడంలో ఉద్దేశం ఏంటని, మౌనంగా బతకడానికి తాము జంతువులం కాదంటూ ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రశ్నించడం తమ హక్కు అని.. ఏ నాయకుడైనా సమధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందని సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేశారు.

Updated at - Jun 06 , 2026 | 02:01 PM