కార్తీక మాసం తొలి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ..
ABN, Publish Date - Nov 16 , 2026 | 10:28 AM
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీశైలంలో రద్దీ నేపథ్యంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటంతో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాలను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.
Updated at - Nov 16 , 2026 | 10:28 AM