ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత క్లీన్ చిట్..

ABN, Publish Date - Feb 27 , 2026 | 11:57 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను రౌస్ అవెన్యూ కోర్టు తప్పించింది.

ఢిల్లీ: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవితకు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను రౌస్ అవెన్యూ కోర్టు తప్పించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 23మంది తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కవితతోపాటు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌, మాజీమంత్రి సిసోడియాకు క్లీన్‌చిట్ ఇచ్చింది. తనకు క్లీన్ చిట్ ఇవ్వడంపై కవిత స్పందించారు. రాజకీయ కారణాలతోనే తనపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ లిక్కర్ కేసును ఎవరూ నమ్మలేదని.. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను మొదటి నుంచి చెబుతున్నదే ఈ రోజు తీర్పుతో నిజమైందని.. న్యాయవ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదని సంతోషం వ్యక్తం చేశారు. కేసు నుంచి తప్పించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానన్నారు. లిక్కర్ కేసు ఒక రాజకీయ కుట్రని.. దాన్ని అడ్డుపెట్టుకుని తన గురించి రకరకాలుగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను హింసించిన వారు ఇప్పుడేం సమాధానం చెబుతారంటూ కవిత సూటిగా ప్రశ్నించారు.

Updated at - Feb 27 , 2026 | 12:53 PM