మరో వీడియో రిలీజ్.. 'నాకు న్యాయం చేయకపోతే చనిపోతా..'
ABN, Publish Date - Mar 28 , 2026 | 03:11 PM
ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ప్రభుత్వోద్యోగి హర్ష వీణ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ మరో వీడియో రిలీజ్ చేసింది హర్ష వీణ. ఆ వీడియోలో ఏముందంటే.?
ఇంటర్నెట్ డెస్క్: కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ప్రభుత్వోద్యోగి హర్ష వీణ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు న్యాయం చేయకపోతే జనసేన పార్టీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని మరో వీడియో రిలీజ్ చేసింది హర్ష వీణ. ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారంపై అధిష్ఠానానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆమె ఆరోపించింది.
Updated at - Mar 28 , 2026 | 03:36 PM