నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు: జగన్
ABN, Publish Date - Feb 06 , 2026 | 07:26 PM
పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ నివాసాలపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారంటూ ఆగ్రహించారు.
ఎన్టీఆర్: పోలీసుల సమక్షంలోనే వైసీపీ నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ నివాసాలపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారంటూ ఆగ్రహించారు. సీఎం చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(శుక్రవారం) విజయవాడ ఇబ్రహీంపట్నం వచ్చిన జగన్.. మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
Updated at - Feb 06 , 2026 | 07:26 PM