ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ అరెస్ట్

ABN, Publish Date - Nov 13 , 2026 | 10:43 AM

నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ డీఈఈ రాగిరి సత్యనారాయణను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, వనపర్తి సహా 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.5 నుంచి 6 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.

నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) రాగిరి సత్యనారాయణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు.. సత్యనారాయణ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, వనపర్తి సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపి, ప్రభుత్వ విలువల ప్రకారమే సుమారు రూ. 5 నుంచి 6 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను గుర్తించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Updated at - Nov 13 , 2026 | 10:43 AM