సంక్రాంతి వేడుకల్లో గుర్రపు స్వారీలు..

ABN, Publish Date - Jan 13 , 2026 | 09:16 PM

దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మెుదలయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సందర్భంగా ముస్తాబయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు బయలుదేరారు.

తూ.గో.జిల్లా: దేశవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మెుదలయ్యాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి సందర్భంగా ముస్తాబయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, నగరాల్లో ఉంటున్న వారంతా స్వగ్రామాలకు బయలుదేరారు. పిండి వంటలు ఆరగించేందుకు, కోడి, ఎడ్ల పందేలు తిలకించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కొత్త ట్రెండ్ మెుదలైంది. ఈ ఏడాది సంక్రాంతి సంబరాల్లో భాగంగా గుర్రపు స్వారీలు నిర్వహిస్తున్నారు. పోటీలను ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి రైడర్స్ పెద్దఎత్తున వెళ్తున్నారు. గుర్రపు స్వారీల పోటీలతో స్థానికులకు ఈసారి డబుల్ ధమాకా దొరికినట్లు అయ్యింది.

Updated at - Jan 13 , 2026 | 09:16 PM