వీహెచ్‌తో భేటీ అయిన వేం నరేందర్ రెడ్డి..

ABN, Publish Date - Mar 06 , 2026 | 08:15 PM

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కాంగ్రెస్ రాజ్యసభ్య ఎంపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ స్థానం కోసం వీహెచ్ తీవ్రంగా ప్రయత్నించగా.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం చివరికి వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుతో కాంగ్రెస్ రాజ్యసభ్య ఎంపీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం కోసం వీహెచ్ తీవ్రంగా ప్రయత్నించగా.. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం చివరికి వేం నరేందర్‌రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో వీహెచ్ ఇంటికి ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డిని వీహెచ్ శాలువాతో సత్కరించారు. అనంతరం వారిద్దరూ దాదాపు 2 గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. తనకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై వీహెచ్ అలకబూనినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని వేం నరేందర్‌రెడ్డి బుజ్జగించినట్లు సమాచారం.

Updated at - Mar 06 , 2026 | 08:15 PM