అమరావతి ప్రజలు 20ఏళ్లు ఎక్కువగా జీవిస్తారు: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Mar 01 , 2026 | 08:24 PM
సీజేఐ ఇవాళ(ఆదివారం) మొత్తం అమరావతిలో ఉన్నారని, ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సీజేఐ ఇక్కడకు వచ్చారని తెలిపారు.
అమరావతి: సీజేఐ ఇవాళ(ఆదివారం) మొత్తం అమరావతిలో ఉన్నారని, ఇది తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సీజేఐ ఇక్కడకు వచ్చారని తెలిపారు. విజయవాడలో ఆర్బిట్రేషన్ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు సీజేఐ సూర్యకాంత్, సీఎం చంద్రబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాజధాని కోసం రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతిని గొప్ప నగరంగా నిర్మిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ఉండేవారు 20ఏళ్లు ఎక్కువగా జీవిస్తారని.. 2047 నాటికి భారత్ నెంబర్‌వన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశానికి యువత, టెక్నాలజీ పెద్ద బలమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Updated at - Mar 01 , 2026 | 08:26 PM