సంకల్ప యాత్ర చేపట్టిన బండ్ల గణేశ్..
ABN, Publish Date - Jan 19 , 2026 | 10:17 AM
తాను చేపట్టిన సంకల్ప యాత్ర రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమేనని సినీ నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అభిమానంతోనే తాను తిరుమలకు నడిచి వెళ్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: తాను చేపట్టిన సంకల్ప యాత్ర రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమేనని సినీ నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అభిమానంతోనే తాను తిరుమలకు నడిచి వెళ్తున్నట్లు చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశీస్సులతో ముందడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు బండ్ల గణేశ్ సంకల్ప యాత్ర విజయవంతం అవ్వాలని నటుడు శివాజీ, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు ఆకాంక్షించారు.
Updated at - Jan 19 , 2026 | 10:17 AM