అయోధ్యలో గిన్నిస్ రికార్డ్.. 30 లక్షల దీపాలతో..

ABN, Publish Date - Nov 08 , 2026 | 11:48 AM

దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయు నది తీరంలో 56 ఘాట్లపై 30 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించారు. ఈ దీపోత్సవం సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది.

దీపావళి సందర్భంగా అయోధ్య నగరం దివ్యమైన దీపకాంతులతో వెలిగిపోయింది. సరయు నది తీరంలోని 56 ఘాట్లలో ఏకంగా 30 లక్షల మట్టి ప్రమిదలను వెలిగించి సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. రామ్‌కీ పైడీ వేదికగా జరిగిన ఈ అద్భుత వేడుకల్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుష్పక విమానం తరహా హెలికాప్టర్‌లో రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడి వేషధారణలోని కళాకారులు వేదిక వద్దకు చేరుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.

Updated at - Nov 08 , 2026 | 11:48 AM