ఆరో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ABN, Publish Date - Feb 19 , 2026 | 09:27 AM

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

అమరావతి, ఫిబ్రవరి 19: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) ఆరో రోజుకు చేకున్నాయి. నేడు బడ్జెట్ చర్చపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తరాల్లో కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ రుణాలు, క్రైస్తవ సంస్థల ఆస్తుల పరిరక్షణ, పి.గన్నవరం నుంచి గోపాలపురం వరకు గోదావరి కరకట్ట పునరుద్ధరణ, రాష్ట్రంలో సైబర్ నేరాలు ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అలాగే, రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఏపీఈపీడీసీఎల్‌లో లైన్మెన్ల కొరత, పాత ఎడ్లంకలో భూక్రమక్షయం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, సమగ్ర శిక్షా అభియాన్ ఒప్పంద ఉద్యోగులు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

Updated at - Feb 19 , 2026 | 10:31 AM