అమరావతిలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ABN, Publish Date - Jan 26 , 2026 | 08:36 AM

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని అమరావతిలో ఘనంగా జరుగుతున్నాయి.

అమరావతి: 77వ గణతంత్ర వేడుకలు రాజధాని అమరావతిలో ఘనంగా జరుగుతున్నాయి. అమరావతిలో తొలిసారిగా జరుగుతున్న ఈ గణతంత్ర వేడుకలకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌తోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

అంతకుముందు రాజధాని అమరావతిలో ఈ వేడుకలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విచ్చేశారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తోపాటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితరులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ వేడుకలను లైవ్ ద్వారా వీక్షించండి..

Updated at - Jan 26 , 2026 | 09:07 AM