ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతే
ABN, Publish Date - Mar 28 , 2026 | 02:58 PM
ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని అమరావతే అనే తీర్మానానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరముందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని అమరావతే అనే తీర్మానానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరముందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో అన్నారు. అమరావతి కోసం 29 గ్రామాల రైతులు 34వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణం కేవలం ఒక ప్రాంతం కోసమో, జిల్లా కోసమో, కొంతమంది ప్రజల కోసమో కాదని.. అది ఎల్లప్పుడూ ప్రజల కోసమేనని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.
Updated at - Mar 28 , 2026 | 03:11 PM