అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరైన ప్రముఖులు
ABN, Publish Date - Jan 29 , 2026 | 11:19 AM
విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి.
ముంబై, జనవరి 29: విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 11.00 గంటలకు పుణే జిల్లా బారామతి సమీపంలోని విద్య ప్రతిష్టాన్ మైదానంలో అజిత్ పవార్ చితికి ఆయన పెద్ద కుమారుడు నిప్పంటించారు. ఈ అంత్యక్రియలకు పలువురు కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తోపాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. ఏపీ నుంచి మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు.
Updated at - Jan 29 , 2026 | 12:39 PM