రిపోర్టర్ పూర్ణ భౌతికకాయానికి భాను ప్రకాశ్ కోగంటి నివాళి

ABN, Publish Date - Mar 20 , 2026 | 04:00 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు(పూర్ణ) భౌతికకాయానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి నివాళులర్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరోలో సీనియర్ రిపోర్టర్‌గా పూర్ణ విధులు నిర్వహిస్తున్నారు. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందారు.

విజయవాడ: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు(పూర్ణ) భౌతికకాయానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాశ్ కోగంటి నివాళులర్పించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏపీ బ్యూరోలో సీనియర్ రిపోర్టర్‌గా పూర్ణ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన మృతిచెందారు. విషయం తెలుసుకున్న భాను ప్రకాశ్‌.. విజయవాడ పటమటలోని పూర్ణ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, బొండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, జనసేన నేత అమ్మిశెట్టి వాసుతోపాటు జర్నలిస్టు సంఘాల నేతలు పూర్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు.

Updated at - Mar 20 , 2026 | 04:05 PM