కార్ పార్కింగ్‌లో శవమై కనిపించిన వాచ్‌మన్..
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:34 PM
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ భవనంలో వాచ్‌మన్ శవమై కనిపించాడు. కార్ పార్కింగ్ లిఫ్ట్ రాడ్స్‌కు ఉరి బిగించిన స్థితిలో వాచ్‌మన్ మృతదేహం లభ్యమైంది.
హైదరాబాద్‌లోని చైతన్యపురిలో అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఓ భవనంలో వాచ్‌మన్ శవమై కనిపించాడు. కార్ పార్కింగ్ లిఫ్ట్ రాడ్స్‌కు ఉరిబిగించిన స్థితిలో వాచ్‌మన్ మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. చామల ముత్తయ్య గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తి దగ్గర పని చేస్తున్నాడు. ముత్తయ్య యజమాని చైతన్యపురిలో భవనం నిర్మిస్తున్నాడు. ఆ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ముత్తయ్య అనుమానాస్పద స్థితిలో భనవంలో శవమై కనిపించాడు.
కార్ పార్కింగ్ లిఫ్ట్ రాడ్స్‌కు ఉరిబిగించిన స్థితిలో అతడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముత్తయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముత్తయ్యది ఆత్మహత్య కాదని, హత్యేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, యజమానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబసభ్యుల ఆందోళన నేపథ్యంలో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవి కూడా చదవండి..
లోకల్ ట్రైన్‌లో మహిళకు సీమంతం.. ఆమె సంతోషానికి అవధులు లేవు..
రంగంలోకి రాహుల్.. రాజీనామాపై భూపెన్ బోరా పునరాలోచన