Share News

తల్లిని గొంతు కోసి చంపిన కొడుకు

ABN , Publish Date - Sep 25 , 2026 | 03:35 AM

భర్త, ఇద్దరు పిల్లలున్న ఆమె.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలేసి, అతడితో కలిసి జీవించేందుకు ఇంట్లోంచి బయలుదేరేందుకు సిద్ధపడింది.

తల్లిని గొంతు కోసి చంపిన కొడుకు
udaysree

  • భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి నచ్చిన వ్యక్తితో

    కలిసి జీవించేందుకు సిద్ధమైన 37 ఏళ్ల మహిళ

  • ఆమెకు, కుమారుడికి మధ్య తీవ్ర వాగ్వాదం

కత్తితో కుమారుడి దాడి.. ఆమె అక్కడికక్కడే మృతి

కాజీపేట. సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): భర్త, ఇద్దరు పిల్లలున్న ఆమె.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తను, పిల్లలను వదిలేసి, అతడితో కలిసి జీవించేందుకు ఇంట్లోంచి బయలుదేరేందుకు సిద్ధపడింది. విషయాన్ని తెలుసుకున్న కుమారుడు, ఆమెను గొంతుకోసి చంపేశాడు. హనుమకొండ జిల్లా కాజీపేటలో గురువారం ఈ ఘటన జరిగింది. హతురాలు 37 ఏళ్ల నాగుల ఉదయశ్రీ. ఉదయశ్రీ భర్త రైల్వేలో కాంట్రాక్టు ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆమె పెద్ద కుమారుడు దొరబాబు (21) డిగ్రీ చదువుతున్నాడు. ఉదయశ్రీకి హైదరాబాద్‌ ఉప్పల్‌ వాస్తవ్యుడు, మార్కెటింగ్‌ చేసే రాజశేఖర్‌తో కొంత కాలం కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమేర్పడింది. అతడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. ఉదయశ్రీకి, రాజశేఖర్‌కు మధ్య ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం ప్రేమగా మారింది. ఇది ఆమె ఇంట్లో తెలియడంతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రాజశేఖర్‌తో సహజీవనం చేసేందుకు ఉదయశ్రీ గురువారం ఇంట్లోంచి బయటకు వెళ్లేందుకు సిద్ధమవగా కుమారుడు దొరబాబు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన దొరబాబు కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడికి దిగి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉదయశ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత దొరబాబు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. డీసీపీ కవిత, ఏసీపీ ప్రశాంత్‌ రెడ్డి ఘటనాస్థలికి వచ్చివివరాలుతెలసుకున్నారు.

Updated Date - Sep 25 , 2026 | 03:35 AM