పేదలకు కార్పొరేట్ వైద్యం ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:43 AM
పేదలకు ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కార్పొరేట్ వైద్యసేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీలో 20 నుంచి వైద్య సేవలు
డిసెంబరు ఆఖరుకల్లా పూర్తి స్థాయి సేవలు: పొంగులేటి
వరంగల్ మెడికల్/హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పేదలకు ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కార్పొరేట్ వైద్యసేవలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు. వైద్య ఖర్చుల భారం కారణంగా పేదలు ఇబ్బందులు పడకూడదని, ప్రతీ ఒక్కరికి నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గురువారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంత్రి సీతక్క, ఎంపీలు వేం నరేందర్రెడ్డి, బలరాం నాయక్తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి.. మాట్లాడుతూ ఈ నెల 20న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పరిమిత వైద్య సేవలను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నవంబరులో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చి డిసెంబరు చివరికల్లా పూర్తిస్థాయిలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశం కోసం పోరాటం చేస్తున్నారని మంత్రి పొంగులేటి గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దేశప్రజల పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్
విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్