విజయ్, రష్మిక పెళ్లి.. ఈ ప్రాంతాల్లో స్వీట్ల పంపిణీ, అన్నదానం
ABN , Publish Date - Mar 01 , 2026 | 11:21 AM
దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కోసం విరోష్ జోడీ స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు తెలుగు రాష్ట్రాలోని పలు దేవాలయాల్లో అన్నదానం జరగనుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: హీరో విజయ్‌దేవర కొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఈ నెల 26వ తేదీన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో చాలా తక్కువ మంది బంధుమిత్రుల మధ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జంట ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. విజయ్, రష్మికలు రేపు (సోమవారం) నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం తుమ్మన్ పేటకు వెళ్లనున్నారు. నూతన ఫామ్ హౌజ్‌లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మనపేటలో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్‌ను ముస్తాబు చేశారు.
ఇక, దేశ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కోసం విరోష్ జోడీ స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమం చేపట్టింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో స్వీట్ల పంపిణీతో పాటు తెలుగు రాష్ట్రాలోని పలు దేవాలయాల్లో అన్నదానం జరగనుంది. దేశ వ్యాప్తంగా స్వీట్ల పంపిణీపై విరోష్ జోడీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో.. ‘మా ప్రయాణం, ప్రేమలో మీరంతా ఓ భాగం. మా పెళ్లి వేడుకలను మీతో పాటు సెలెబ్రేట్ చేసుకోవటం నిజంగా మాకు సంతోషం. మనకు వేడుక అంటే స్వీట్లే. మార్చి 1వ తేదీన దేశ వ్యాప్తంగా స్వీట్లు, ప్రేమ నిండిన ట్రక్కులను పంపిస్తున్నాం’ అని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఈ దేవాలయాల్లో అన్నదానం
హైదరాబాద్‌లోని హరేకృష్ణ హెరిటేజ్ టెంపుల్, చింతపల్లిలోని సాయిబాబా దేవాలయం, మహబూబ్ నగర్‌లోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, విశాఖపట్నంలోని శ్రీకనక మహాలక్ష్మి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, విజయవాడలోని శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..
ఈ కోతి ముందు స్పైడర్ మ్యాన్ కూడా దిగదుడుపే.. ఏం చేసిందో మీరే చూడండి..