Share News

ధురంధర్ సినిమా చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దర్శకుడిపై ప్రశంసల జల్లులు..

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:41 PM

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ధురంధర్ 2’ చూశారు. సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు.

ధురంధర్ సినిమా చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దర్శకుడిపై ప్రశంసల జల్లులు..
Kishan Reddy Dhurandhar movie

హైదరాబాద్, ఏప్రిల్ 12: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేటెస్ట్ బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ సినిమా ‘ధురంధర్ 2’ చూశారు. సినిమా అద్భుతంగా ఉందని అన్నారు. సినిమా దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల జల్లులు కురిపించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆదిత్య చాలా అద్భుతంగా సినిమా తీశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సినిమా తీశారు. సినిమా అంటే వినోదమే కాదు ఒక బాధ్యత కూడా అనిపించేలా ధురంధర్ తీశారు. దేశ రక్షణ కోసం భద్రతా సిబ్బంది ఏ విధంగా పని చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు’..


‘దేశ సమగ్రత కోసం, రక్షణ కోసం భద్రతా దళాలు చేస్తున్న త్యాగాలను చూపించారు. స్వాతంత్రం వచ్చిన నాటినుంచి పాకిస్థాన్ భారతదేశంపై చేస్తున్న కుట్రలు.. దేశ సమగ్రతను విచ్చిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను చూపించారు. దేశంలోకి దొంగ నోట్లు తీసుకురావడం చక్కగా చూపించారు. పాకిస్థాన్ భవిష్యత్తులో కూడా కుట్రలు చేస్తూనే ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. భారత భూభాగంలోని ఒక ప్రాంతాన్ని విడదీసి పాకిస్థాన్ అనే శత్రువును తయారు చేసి పెట్టారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో నయాభారత్ ఏ విధంగా రూపొందుతోందో మనం చూశాం’..


‘ఆపరేషన్ సిందూర్, సర్జికల్ స్ట్రైక్ లాంటి కార్యక్రమాలతో పాకిస్థాన్ దుశ్చర్యలను ఎలా తిప్పి కొట్టారో చూశాం. ప్రతి ఒక్కరూ ధురంధర్ సినిమా చూడాలి. అన్ని వర్గాల ప్రజలు దేశ రక్షణ కోసం అండగా నిలబడాలి. దేశ రక్షణ కోసం భద్రతా బలగాలు చేస్తున్న సాహసాలను తెలుసుకోవాలి. సినిమాలో నటీనటులు నటించలేదు.. జీవించారు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

సాల్ట్, కోహ్లీ, పాటీదార్ హాఫ్ సెంచరీలు.. ముంబై ఇండియన్స్ టార్గెట్ 241

29 సెకెన్ల ఛాలెంజ్.. ఈ రెండు ఫొటోల మధ్యలో మూడు తేడాలను కనిపెట్టండి..

Updated Date - Apr 12 , 2026 | 09:45 PM