Share News

హైదరాబాద్‌లో విషాదం.. యజమానిని కొమ్ములతో పొడిచి చంపిన గేదె..

ABN , Publish Date - Jul 25 , 2026 | 08:52 PM

హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పెంపుడు గేదె దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బర్రెలను మేపడానికి తీసుకెళుతుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో విషాదం.. యజమానిని కొమ్ములతో పొడిచి చంపిన గేదె..
rajendranagar buffalo attack

ఇంటర్‌నెట్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పెంపుడు గేదె దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బర్రెలను మేపడానికి తీసుకెళుతుండగా ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్‌కు చెందిన మల్లేపల్లి వెంకటేశ్‌కు సొంతంగా కొన్ని గేదెలు ఉన్నాయి. శనివారం గేదెలను మేపడానికి బయలుదేరాడు.


ఈ నేపథ్యంలోనే ఓ గేదె వెనుకనుంచి అతడిపై దాడి చేసింది. కొమ్ములతో పొడవటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్ గేదె చేతిలో మృతి చెందిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు

రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే..

Updated Date - Jul 25 , 2026 | 09:16 PM