Share News

నల్గొండలో రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా..

ABN , Publish Date - Apr 22 , 2026 | 08:46 PM

కారు.. బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నల్గొండ జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

నల్గొండలో రోడ్డు ప్రమాదం.. శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా..
Nalgonda road accident

నల్గొండ, ఏప్రిల్ 22: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు.. బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. శాకాజిపురానికి చెందిన బాల్‌రెడ్డి, అలివేలు, పాల్వాయి గ్రామానికి చెందిన మంజుల, వెంకటమ్మ నల్గొండలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. వద్దిరెడ్డిగూడెం సమీపంలో అతి వేగం కారణంగా కారు ప్రమాదానికి గురైంది.


ఓ బైకును ఢీకొట్టి కారు అదుపుతప్పింది. ఆ వెంటనే ఓ చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న కనగల్‌కు చెందిన మధుబాబు, ధనుంజయ అక్కడికక్కడే చనిపోయారు. కారులో ఉన్న బాల్‌రెడ్డి కూడా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రమాదం గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

ఆసియా క్రీడల ప్రసార హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్

పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు

Updated Date - Apr 22 , 2026 | 08:50 PM