భాగ్యలక్ష్మీ ఆలయంలో దీపావళి వెలుగులు
ABN , Publish Date - Nov 10 , 2026 | 06:02 AM
దీపావళి సందర్భంగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది
అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
చార్మినార్ నవంబర్ 9 (ఆంధ్రజ్యోతి): దీపావళి సందర్భంగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులతో పాటు పలువురు మంత్రులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. గుల్జారాహౌస్, మదీనా వరకు భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దీపావళి సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించగా, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం రాత్రి ఖజానా కార్యక్రమంలో భాగంగా భక్తులకు వెండి నాణాలను పంపిణీ చేశారు.