హైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ.. తెలంగాణ విద్యార్థి సంఘాల చలో లోక్‌భవన్
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:27 PM
ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్ కుంభకోణంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం లోక్‌భవన్ ముట్టడికి యత్నించాయి.
హైదరాబాద్, జులై 21: ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్ కుంభకోణంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం సాయంత్రం లోక్‌భవన్ ముట్టడికి యత్నించాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే లోక్‌భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వారిని అరెస్ట్ చేసి అక్కడినుంచి తరలించారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో రేపు ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె
వైభవ్ సూర్యవంశీ ప్రత్యేకమైన ప్లేయర్.. జాగ్రత్తగా తీర్చిదిద్దాలి: సికందర్ రజా