Share News

మార్కెట్‌ యార్డుల డిజిటైజేషన్‌కు చర్యలు

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:38 AM

రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డులను ఆధునికీకరించి, డిజిటల్‌ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు

మార్కెట్‌ యార్డుల డిజిటైజేషన్‌కు చర్యలు
TummalaNageshwarrao

  • రైతులకు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరగాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మార్కెట్‌ యార్డులను ఆధునికీకరించి, డిజిటల్‌ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్‌ యార్డులోకి వాహనం ప్రవేశించినప్పటి నుంచి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, తూకం, లావాదేవీలు, చెల్లింపులు పూర్తిచేసుకుని బయటకు వెళ్లే వరకు ప్రతి దశలో డిజిటల్‌ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మార్కెటింగ్‌ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. రైతులకు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరిగేలా వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. అజీజ్‌నగర్‌లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొత్త మార్కెట్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. తూప్రాన్‌, గజ్వేల్‌, సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సమీకృత మార్కెట్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావం.. నీటిని పొదుపుగా వినియోగించండి: సీఎస్‌

విదేశీ బొగ్గు దిగుమతితో సింగరేణికి మరణశాసనం రాస్తున్న సీఎం రేవంత్: కేటీఆర్

Updated Date - Oct 16 , 2026 | 05:40 AM