ఏపీకి తెలంగాణ విద్యుత్తు సహాయక బృందాలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 05:03 AM
తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాలకు తెలంగాణ సర్కారు విద్యుత్తు సహాయక బృందాలను పంపించింది.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు
పునరుద్ధరణకు సహకరించాలని భట్టికి ఏపీ సీఎం ఫోన్
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతాలకు తెలంగాణ సర్కారు విద్యుత్తు సహాయక బృందాలను పంపించింది. ఏపీ సీఎం చంద్రబాబు, విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేసి.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు సహకరించాలని కోరారు. 16 వేలకు పైగా విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని, వందల గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందన్నారు. విద్యుత్తు పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్‌తో చర్చించి, ఏపీకి సహాయక బృందాలను పంపామని భట్టి తెలిపారు.