ఏకపక్షంగా సీఎంఆర్ ఒప్పందం రైస్ మిల్లులు నడిపే ప్రసక్తే లేదు
ABN , Publish Date - Sep 12 , 2026 | 02:35 AM
ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, టెండర్లలో పారదర్శకత లేకపోవడం, ప్రభుత్వ శాఖల ఒత్తిళ్లు, ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గతిలేని పరిస్థితుల్లో మిల్లులకు తాళాలు వేసి నిరవధిక బంద్ చేస్తున్నామని రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పేర్కొంది.
మిల్లుల తాళాలను కలెక్టర్లకు అప్పగించాం: మిల్లర్ల సంఘం
పంజాగుట్ట, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు, టెండర్లలో పారదర్శకత లేకపోవడం, ప్రభుత్వ శాఖల ఒత్తిళ్లు, ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గతిలేని పరిస్థితుల్లో మిల్లులకు తాళాలు వేసి నిరవధిక బంద్ చేస్తున్నామని రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పేర్కొంది. అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీ వీరేశం, ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు మీడియాతో మాట్లాడారు. రైస్ మిల్లులకు తాళం వేసి తాళం చెవులను తెలంగాణ ఉద్యమకారుడు రఫీకి అందజేశారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలకు కూడా అందజేశామని తెలిపారు. రైస్ మిల్లులు నడిపే ప్రసక్తి లేదని, ప్రభుత్వ స్పందించి డిమాండ్లు పరిష్కరించే వరకు బంద్ కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వానికి, మిల్లర్లకు మధ్య ఉన్న సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఒప్పందం ఏకపక్షంగా ఉందని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు. మంత్రులు, అధికారులను కలిసేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతోనే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏడేళ్ల తరువాత భారత్‌కు చైనా అధినేత.. ఇరు దేశాల మైత్రి బలపడనుందా.?
బ్రిక్స్ సదస్సు.. పుతిన్, షీ జిన్‌పింగ్ బస చేసే హోటళ్లలో రోజుకు అద్దె ఎన్ని లక్షలంటే..?