Share News

Telangana: జైళ్లలో 12శాతం పెరిగిన ఖైదీలు

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:51 AM

రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో 11.8 శాతం పెరిగిందని జైళ్లశాఖ 2025 వార్షిక నివేదిక పేర్కొంది. ఈ నివేదికను చంచల్‌గూడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా విడుదల చేశారు.

Telangana: జైళ్లలో 12శాతం పెరిగిన ఖైదీలు
Telangana Prisons department

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జైళ్లలో ఖైదీల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో 11.8 శాతం పెరిగిందని జైళ్లశాఖ 2025 వార్షిక నివేదిక పేర్కొంది. ఈ నివేదికను చంచల్‌గూడలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా విడుదల చేశారు. ఐజీలు మురళీబాబు, రాజేష్‌, డీఐజీలు శ్రీనివాస్‌, సంపత్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వార్షిక నివేదికలోని కీలకాంశాలు..

  • 2024లో జైళ్లలో ఖైదీలు 38,079 మంది ఉండగా, 2025లో 11.8 శాతం పెరిగి 42,566కు చేరింది.

  • డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో జైలుకు వచ్చినవారు 2,833 మంది ఉన్నారు. వారిలో ఒక మహిళ ఉంది. ఈ కేసుల్లో ఖైదీల సంఖ్య 152ు పెరిగింది. తర్వాతి స్థానంలో సైబర్‌ నేరాల ఖైదీల్లో 135.6 శాతం పెరుగుదల ఉంది. జైళ్లలో 1,784 మంది సైబర్‌ నేరగాళ్లు ఉన్నారు.

  • గత ఏడాది జైళ్లకు వచ్చినవారిలో 19,413 మంది 18-30 ఏళ్ల వయస్సు వారు ఉండగా ఈ వయస్సు ఖైదీల్లో 13.31శాతం పెరుగుదల నమోదైంది.

  • 2025లో జైళ్లకు వచ్చినవారిలో మొదటిసారి నేరాలు చేసినవారు 40,090 మంది, రిపీడెట్‌ అఫెండర్స్‌ 2,496 మంది ఉన్నారు. విదేశాలకు చెందిన ఖైదీలు 2024లో 107 మంది ఉండగా 2025లో 74కు తగ్గింది.

  • మత్తుపదార్థాలకు బానిసైన 2,915 మంది ఖైదీల్లో డీ-అడిక్షన్‌ కేంద్రాల్లో చికిత్స ద్వారా 590 మందిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు.

  • సెక్యూరిటీ బాండ్‌ సమర్పించలేక జైళ్లలోనే మగ్గుతున్న అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు ఆర్థికసాయం అందించి, 18 మంది జైళ్ల నుంచి విడుదలయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని సౌమ్యా మిశ్రా తెలిపారు.

Updated Date - Jan 13 , 2026 | 07:51 AM