Share News

తీవ్ర విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి శ్రీనివాస్ మృతి..

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:02 PM

బహ్రెయిన్‌లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందారు.

తీవ్ర విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి శ్రీనివాస్ మృతి..

నిజామాబాద్: బహ్రెయిన్‌లో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ 2019 నవంబర్ 26న బహ్రెయిన్‌లోని ఏంఎసీ సంస్థలో చేరారు. ప్రస్తుతం ఆయన ప్రాజెక్టు డిపార్ట్‌మెంట్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే, దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరానికి శ్రీనివాస్ వెళ్లగా ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.


సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టి శ్రీనివాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఆయన పనిచేస్తున్న ఏంఎసీ సంస్థకు స్థానిక అధికారులు సమాచారం అందించారు. ఉద్యోగి మృతిపై సంతాపం తెలిపిన సదరు సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని నిజామాబాద్ జిల్లాలోని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు విగతజీవిగా మారాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. దక్షిణ కొరియా పర్యటనలో లోకేశ్ బిజీబిజీ

రాజకీయంగా ఎదిగేందుకు రాముని పేరు వాడుకున్నారు.. బీజేపీపై పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

Updated Date - Jul 06 , 2026 | 05:07 PM