హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం
ABN , Publish Date - Sep 19 , 2026 | 07:02 AM
‘‘దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును బీజేపీ స్వాగతిస్తోంది’’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడే దిశగా వెలువడిన ఈ తీర్పు ప్రజాస్వామ్యానికే గర్వకారణమని.. కాంగ్రెస్ ప్రభుత్వ అనైతిక విధానాలకు చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి
స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే
ఈ పరిస్థితి వచ్చేది కాదు: బండి సంజయ్
కాంగ్రెస్‌కు గౌరవముంటే మిగతా ఎమ్మెల్యేల
చేత రాజీనామా చేయించాలి: మహేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును బీజేపీ స్వాగతిస్తోంది’’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడే దిశగా వెలువడిన ఈ తీర్పు ప్రజాస్వామ్యానికే గర్వకారణమని.. కాంగ్రెస్ ప్రభుత్వ అనైతిక విధానాలకు చెంపపెట్టు అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై నిజంగా గౌరవం ఉంటే.. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
ఇక.. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు చెంపపెట్టు అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి.. రాజీనామా చేయకుండానే మరో పార్టీలో చేరడం ప్రజాభీష్టానికి వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. ‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ గుర్తుపై ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. కాంగ్రె్‌సలో చేరి.. కనీసం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం రాజ్యాంగ విరుద్థం.’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా.. దానం నాగేందర్‌పై హైకోర్టు అనర?త వేటు ప్రజాస్వామ్య విజయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
‘శాసన వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్న కాంగ్రె్‌సకు ఈ తీర్పు చెంప పెట్టు. శాసన వ్యవస్థ విచక్షణాధికారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అసెంబ్లీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే నేడు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఇకనైనా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా శాసనసభ స్పీకర్ వ్యవహరించాలి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను అనరు?లుగా ప్రకటించాలి. ’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య పరిరక్షణకు నిదర్శనమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంపై కాంగ్రె్‌సకు గౌరవం ఉంటే పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయించాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ తరపున సుప్రీంలో కేవియట్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
సాయం చేస్తూ మృత్యుఒడికి..
వ్యవసాయంతోనే ప్రపంచ గమనం