15కల్లా ఉద్యోగుల రికార్డుల డిజిటైజేషన్ పూర్తి
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:28 AM
ఈ నెల 15లోపు ప్రభుత్వ ఉద్యోగుల రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలంటూ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.
అధికారులకు సీఎస్ ఆదేశం
ఈ నెల 15లోపు ప్రభుత్వ ఉద్యోగుల రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలంటూ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. ఉద్యోగులకు చెందిన ‘ఈ-హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్)’లో ఉద్యోగుల నియామకాలు, సర్వీసు రికార్డులు, జీతభత్యాలు, పదోన్నతులు, ఇతర ఉద్యోగ సేవల పూర్తి సమాచారం అప్‌లోడ్ చేయాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.48 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా.. 38,710 కార్యాలయాల్లో 93 శాతం వరకు ఉద్యోగుల డేటా అప్‌లోడింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా డేటాను ఈ నెల 15లోపు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల డిజిటల్ వివరాలు అందుబాటులో ఉండడం వల్ల పారదర్శకత, పరిపాలనలో మరింత వేగం, సామర్థ్యం పెంపుదలకు అవకాశం ఉంటుందన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!